జపాన్ తో భారత్ అణు ఒప్పందం.!

- November 11, 2016 , by Maagulf
జపాన్ తో భారత్ అణు ఒప్పందం.!

ప్రధాని నరేంద్రమోదీ జపాన్‌ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా భారత్‌, జపాన్‌ మధ్య అణు ఒప్పందం కుదిరింది. అనంతరం మోదీ, జపాన్‌ ప్రధాని షింజో అబే సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఎన్‌ఎస్‌జీలో భారత సభ్యత్వానికి మద్దతు తెలిపిన జపాన్‌కు మోదీ ధన్యవాదాలు తెలిపారు. జపాన్‌తో పౌర అణు ఒప్పందం చరిత్రాత్మకమైనదని అభివర్ణించారు. జపాన్‌తో పౌర అణు ఒప్పందం కుదుర్చుకున్న తొలి దేశం భారత్‌ అని తెలిపారు. ఇరు దేశాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసి పోరాడుతాయని స్పష్టం చేశారు. వ్యూహాత్మక భాగస్వామ్యం వల్ల ఇరుదేశాల్లో శాంతి, సమన్వయం, స్థిరత్వం నెలకొంటాయన్నారు. భారత్‌, జపాన్‌ సహజ భాగస్వామ్య దేశాలని మోదీ పేర్కొన్నారు. పెట్టుబడులు, తయారీ రంగాలకు భారత్‌ ప్రధాన కేంద్రం కావాలన్నదే తమలక్ష్యమని స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com