ఫిల్పీన్ డ్రగ్ లార్డ్ యూఏఈలో అరెస్ట్
- November 11, 2016
మనీలా: అనుమానిత డ్రగ్ లార్డ్ యూఏఈలో అరెస్టయ్యాడు. అతన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఫిలిప్పీన్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. యూఏఈలోని ఫిలిప్పీన్ అంబాసిడర్ నుంచి సంబంధిత లేఖ అందిందని, అనుమానిత డ్రగ్ లార్డ్ కెర్విన్ ఎస్పినోసా, స్టేట్ విట్నెస్గా మారేందుకు అవకాశం ఉన్నట్లు తెలిపారనీ, విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్లో చేరేందుకు అతను సమ్మతించాడని జస్టిస్ సెక్రెటరి విటాలినో అగ్రిరో చెప్పారు. తనకు అండదండలు అందిస్తున్నవారి వివరాల్ని వెల్లడించేందుకు సుముఖంగా ఉండటంతో మరిన్ని వివరాలు అతని నుంచి రాబట్టాల్సి ఉందని ఆయన వివరించారు. ఫిలిప్పిన్ నేషనల్ పోలీస్ టీమ్, అబుదాబీకి బయల్దేరారు. ఎస్పినోసాకి వీరు ఎస్కార్ట్గా వ్యవహరిస్తారు. మనీలాకి అతన్ని తీసుకెళ్ళాక, పిఎన్పి కస్టోడియల్ సెంటర్కి తరలిస్తారు, ఆ తర్వాత అతన్నుంచి వివరాల్ని సేకరిస్తారు. రోడ్రిగో డిటెర్ట్, ఎస్పినోసాని డ్రగ్ లార్డ్గా గుర్తించారు. అబుదాబీలో ఎస్పినోసా అక్టోబర్ 17న అరెస్టయ్యాడు. ఎస్పినోసా తండ్రి, అల్బెరా - లైట్ మేయర్ పోలీస్ షూటౌట్లో మరణించాడు.
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







