దుబాయ్‌లో మృతిచెందిన ఉగండా మహిళ

- November 11, 2016 , by Maagulf
దుబాయ్‌లో మృతిచెందిన ఉగండా మహిళ

ఉగండాకి చెందిన మహిళ, రియాద్‌ నుంచి స్వదేశానికి వెళుతుండగా, మార్గమధ్యంలో తీవ్ర అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయింది. అయితే దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమె ప్రాణాలు కోల్పోయిందన్న వార్తల్ని విమానాశ్రయ సిబ్బంది ఖండించారు. అనారోగ్యంతో ప్రయాణించలేని పరిస్థితుల్లో ఉన్న ఆమె ఆసుపత్రికి తరలించబడిందనీ, అనంతరనం ఆమె ఆసుపత్రిలో మృతి చెందిందని వారు స్పష్టం చేశారు. ఆమె వద్దనున్న మెడికల్‌ రిపోర్ట్స్‌లో అక్టోబర్‌ నెలలో ఆమె వైద్య చికిత్స పొంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయినట్లుగా ఉందన్నారు అధికారులు. ఆ మహిళ మృతదేహాన్ని ఆసుపత్రిలో భద్రం చేశారు. స్వదేశానికి పంపేందుకు, మహిళ బంధువులు ఆర్థిక భారంతో ఇబ్బందులు పడుతున్నారనీ, స్పాన్సరర్‌ కూడా ఖర్చుల్ని భరించేందుకు సిద్ధంగా లేరని వారు చెప్పారు. ఉగండా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలిపారు దుబాయ్‌ అధికారుఉలు. 23 ఏళ్ళ ఆ మహిళ ఒవేరియన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఆమెకు గతంలో జరిగిన వైద్య పరీక్షలు, చికిత్సను బట్టి తెలియవస్తోంది. అయితే ఆ మహిళ కుటుంబ సభ్యులు గుండె సంబంధిత సమస్యతో ఆమె మృతి చెందినట్లు చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com