కేలండర్ ను విడుదల చేసిన బహ్రైన్ విద్యా శాఖ

- August 28, 2015 , by Maagulf
కేలండర్ ను విడుదల చేసిన బహ్రైన్ విద్యా శాఖ

ఈ సెప్టెంబర్ 1 వ తారీఖు నుండి పాఠశాల సిబ్బంది మరల విధులలో చేరుతుండగా, విద్యార్ధులు అదే నెల 6 నుండి  పాఠశాలలకు వస్తున్న సందర్భంగా, 2015-16 సంవత్సరానికిగాను విద్యా శాఖ వారు తమ కేలండర్ ను విడుదల చేశారు. ఇది, పరీక్షల తేదీలు, రిజిస్ట్రేషన్, పాఠశాల శెలవుదినాలు వంటి వాటిని తెలియబరుస్తుంది. అంతేకాకుండా బహ్రైన్ దేశంలో విద్యా సంవత్సరంలో వచ్చే ముఖ్యమైన తేదీలు, పద్ధతులను కూడా వివరిస్తుంది. ఈ విద్యా సంవత్సరం పాఠశాల పనిదినాల సంఖ్య 196 రోజులు అని, ఇందులో 92 మొదటి సెమిస్టర్ కాగా, 104 రెండవ సెమిస్టరులో ఉంటాయని తెలియవచ్చింది.

 

                     --- ఎం. వాసుదేవ రావు (బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com