పిల్లలను మళ్లీ స్కూళ్లకు పంపేటపుడు...
- August 28, 2015
సెలవుల తరువాత చిన్నారులను మళ్లీ స్కూళ్లకు పంపడం, తల్లిదండ్రులకు బ్రహ్మవిద్యే! ఐతే స్కూళ్ళు ప్రారంభించడానికి కొన్నిరోజుల ముందే పిల్లలకు సమయానికి తయారవడం, అల్పాహారం తీసుకోవడం అలవాటు చేయాలని, అందువల్ల పిల్లలు స్కూల్ రొటీన్ కు అలవాటుపడి, ఇబ్బందిపడకుండా ఉంటారని, పాఠశాలలు మరియు విద్యా సంస్థల ఆరోగ్య శాఖ ఉపాధ్యక్షుడు డా. హమేద్ యగ్యా హుస్సైన్ సలహా ఇచ్చారు. స్కూళ్లకు తిరిగి పంపే ప్పుడు పాటించవలసి అరోగ్య చిట్కాలను గురించి చర్చిస్తూ, ప్రత్యేకించి మాంసం వంటి వంటకాలను లంచ్ లో పెట్టేప్ప్పుడు, అవి చెడిపోకుండా ఐస్ ప్యాక్ వంటివి వాడాలని, అంటు వ్యాధులు వ్యాప్తించకుండా ఉండాలంటే, తల్లిదండ్రులు వారిని 3-5 రోజులు బడికి పంపకుండా ఉండడమే ఉత్తమమని అన్నారు. పిల్లల స్కూలు బాగు, వారిబరువులో 10 శాతం కంటే తక్కువ ఉండాలని, ఇంట్లో టెలివిజను, కంప్యూటర్లు, వీడియో గేములు వంటి స్క్రీన్ ఫ్రీ జోన్లను ఏర్పాటుచేయడం ద్వారా వారు దీక్షగా చదువుకోనేలా ప్రోత్సహించాలని; వారు ప్రశాంతంగా కనీసం 10 గంటలు నిద్రపోవాలని, అందుకై అన్ని డిజిటల్, ఎలక్ట్రానిక్ పరికరాలను నిద్రకు ముందే ఆపివేయాలని డాక్టర్ల సూచనలు. మరి, పాటిద్దామా!
--- సి. శ్రీ (దుబాయ్)
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







