ప్రవాసి ఎక్సలెన్స్ అవార్డ్స్-2016 ప్రెస్ కాన్ఫరెన్స్
- November 12, 2016
కొయలిషన్ ఆఫ్ ఓవర్సీస్ తెలంగాణ అసోసియేషన్స్ (కోట) మరియు ప్రవాసి మిత్ర మాసపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో తేది:18 డిసెంబర్ 2016 న హైదరాబాద్ లో 'అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం' నిర్వహించనున్నామని 'కోటా' వ్యవస్థాపకులు మంద భీంరెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో 12 నవంబర్ 2016 న శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ఇందులో పలు ప్రవాసి తెలంగాణ, ప్రవాసి భారతీయ సంఘాలు పాలు పంచుకోనున్నారు. ఈ సందర్బంగా దేశంకాని దేశంలో పోటీతత్వం, నైపుణ్యం, సామర్ద్యం పాటు మానవతా దృక్పథంతో అందించిన సేవలను గుర్తించి ప్రవాస భారతీయ, భారత సంతతి కి చెందిన వ్యక్తులను 'ప్రవాసి ఎక్సలెన్స్ అవార్డ్స్-2016' లతో సత్కరించి అవార్డులను ప్రధానం చేయనున్నాము అని ఆయన వివరించారు.
తమతమ రంగాలలో విశేష ప్రతిభ కనపర్చిన ప్రవాస భారతీయ, భారత సంతతి కి చెందిన స్త్రీ, పురుషులు భారత దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఈ పురస్కారానికి అర్హురాలే. కుల, మత, ప్రాంతీయ, వంశ, ఐశ్వర్య, నమ్మకాలు ఈ పురస్కారానికి అడ్డుకాదు. ఆయా రంగాలు: చట్టము, వైద్యము, ఆరోగ్యము, స్వయం ఉపాది, సామాజిక / సంఘ సేవా కార్యక్రమాలు, స్వచ్చంద సంస్థ రంగము, కార్మిక సంఘము, పనిమనుషుల సంక్షేమం మరియు హక్కులు, సాంస్కృతిక కార్యక్రమాలు, విద్య, సామాజిక శాస్త్రము మరియు విజ్ఞానము, కళాత్మక కార్యకలాపాలు.
'ప్రవాసి ఎక్సలెన్స్ అవార్డ్స్-2016' కోసం ఎన్నారైలు స్వయంగా గాని, వారి తరఫున ఇతరులుగాని నామినేషన్లను 25 నవంబర్ 2016 లోగా [email protected] కు ఇ-మెయిల్ చేయాలి. సందేహాలకు వాట్సప్ నెం.+91 98494 22622 కు సంప్రదించవచ్చునాని మంద భీంరెడ్డి తెలిపారు.
ఈ విలేఖరుల సమావేశంలో రమేష్ గుడపురి (అధ్యక్షులు, ఇండియా లీగ్ ఆఫ్ అమెరికా), డా.కె.స్వరూపా రెడ్డి (ప్రముఖ గాయని), అరుణా నాయుడు నిమ్మగడ్డ (సిఇఓ, తెలుగువన్ టోరీ రేడియో), పి.సునీల్ కుమార్ రెడ్డి (సినిమా దర్శకులు), సరితా పూవుల (సోషల్ మీడియా మేనేజర్), జగదీశ్ పొట్లూరి (ఫౌండర్, బ్రాండ్ అలయన్స్) సత్యనారాయణ సంగిశెట్టి (కళాకారులు) పాల్గొన్నారు.



తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!









