యూ.ఏ.ఈ. లో 18 తగ్గిన డీజిల్, 8.5 తగ్గిన పెట్రోల్
- August 28, 2015
అంతర్జాతీయ చమురు విపణిలో మార్పులను అనుగుణంగా, నెలవారీ ధరవరల సర్ద్దుబాటులో భాగంగా, యూ. ఏ. ఈ. ఇంధన వనరుల శాఖ దేశంలో పెట్రోలు ధరను 8.5 శాతం, మరియు డీజిల్ ధరలను 18 శాతం తగ్గించింది. దేశంలో అన్ని పంపులు డీజిల్‌ను 1.86 దీనర్లకు, ఈ ప్లస్(ఆక్టెన్ 91) పెట్రోలును 1.89 దీనర్లకు; ఆక్టాన్ క్టే 95 ను 1.96 దీనర్లకు ఆక్టాన్ 98 ను 2.07 దీనర్లకు అమ్మాలని, సదరు శాఖ అండర్ సెక్రటరీ డా. మాటర్ అల్ న్యాదీ నాయకత్వంలోని చమురు ధరల కమిటీ నిర్ణయించింది. ఈ ధరలు ప్రపంచవ్యాప్త సరాసరి చమురు ధరలకు, నిర్వహణ రుసుము, పంపిణీ సంస్థల కనీస లాభాలను కలిపి నిర్ణయించబడ్దాయని ఆయన వివరించారు. కాగా, సెప్టెంబరులో తగ్గిన ఈ చమురుధరలు, ద్రవ్యోల్బణం పై ధరల సంస్కరణల బలహీన ప్రభావాన్ని సూచిస్తోందని, అబుధాబీ కమర్షియల్ బాంకు వారి ముఖ్య ఆర్ధికవేత్త ఐన డా. మోనికా మాలిక్ విశ్లేషించారు.
--- సి. శ్రీ (దుబాయ్)
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







