శెనగలతో ఆరోగ్యం
- August 28, 2015
నానబెట్టిన గింజలు, తృణధాన్యాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. ఈ సంగతి తెలిసిందే. అయితే వాటిలో పెసలు, మినుములు, శెనగలు ఇవి నానబెట్టిన రెండు రోజుల్లోనే మొలకలు వస్తాయి. ఈ రకంగా మొలకెత్తిన గింజలు తీసుకోవడం వల్ల ఇవి చాలా రకాల అనారోగ్యాలను దూరం చేయడంలో తోడ్పడతాయి. వాటిలో ముఖ్యంగా శెనగలు. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల శరీరానికి పీచు పదార్ధం బాగా అందుతుంది. వీటిలోని మెగ్నీషియం, ఫోలేట్ ఖనిజాలు కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో తోడ్పడుతుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడ్తుంది. శెనగల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మహిళల్లో అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయడానికి తోడ్పడతాయి. ముఖ్యంగా రొమ్ము కాన్సర్ కారకాలను నియంత్రించడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. రక్తంలోని ఎలక్ట్రోలైట్లు సమతూకంలో ఉంచేందుకు సహకరిస్తాయి. అధిక రక్త పోటు అదుపులో ఉంటుంది. వీటిని తరచూ తీసుకోవడం వల్ల మలబద్ధకంలాంటి సమస్యలుంటే తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. కాబట్టి మధుమేహులకు కూడా మంచి ఔషధంగా పని చేస్తాయి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







