చెట్టినాడ్ ఫిష్ కర్రీ
- November 12, 2016
కావలసిన పదార్థాలు: చేప ముక్కలు: ఐదు లేక ఆరు, ఉల్లిపాయ: ఒకటి(సన్నగా తరిగి పెట్టుకోవాలి), టమోటా: ఒకటి (సన్నగా తరిగి పెట్టుకోవాలి), చింతపండు గుజ్జు: టేబుల్ స్పూను, పసుపు: అర టేబుల్ స్పూను, కొత్తిమీర తరుగు: కొద్దిగా, నూనె: తగినంత, మెంతులు: అర టీస్పూను, ఆవాలు: అర టీస్పూను, చిన్న ఉల్లిపాయలు: ఆరు లేక ఏడు, వెల్లుల్లి రెమ్మలు: నాలుగు లేక ఐదు, టమోటా:ఒకటి, కరివేపాకు: కొద్దిగా.
మసాలా కోసం: కొబ్బరి పొడి: అరకప్పు, ధనియాల పొడి: టేబుల్ స్పూను, కారం పొడి: టేబుల్ స్పూను,
తయారీ విధానం: ముందుగా మసాలా దినుసులన్నీ మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. బాండీలో కొద్దిగా నూనె వేసి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు వేసి కొద్దిసేపు ఉడికించి అనంతరం వీటిని కూడా రుబ్బి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో నూనె వేసి మెంతులు, ఆవాలు, వెల్లుల్లి రెమ్మలు, చిన్నఉల్లిపాయ ముక్కలు, టమొటా ముక్కలు, కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా రుబ్బిపెట్టుకున్న మసాలా ముద్ద, ఉల్లిపాయ ముద్ద వేసి కొద్దిగా నీరు పోసి ఉడకనివ్వాలి. ఇది ఉడుకుతున్న సమయంలోనే ఉప్పు, కూడా జతచేసుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలను నెమ్మదిగా వేసి మూడు లేక నాలుగు నిమిషాలు ఉడకనిచ్చి దించేయాలి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







