కోడిగుడ్డంత గోధుమ గింజ
- August 28, 2015
ఒక ఊరిలో ఒక చోట పిల్లలు ఆడుకుంటూ ఉండగా వారికి కోడిగుడ్డు సైజులో ఉన్న గోధుమగింజలాంటి వస్తువు ఒకటి దొరికింది. దాంతో వాళ్లు ఆడుకుంటూంటే ఒక బాటసారి చూసి దాన్ని ఆ పిల్లల దగ్గర నుండి తీసుకుని ఆ ఊరి రాజు దగ్గరకు తీసుకుని వెళ్లాడు. ఆయన దాన్ని చూసి ఇదేమిటో కనుక్కోండి అని మంత్రులనడగగా వారు ఒకరికొకరు దాని గురించి తెలుసుకోవడానికి తర్జన భర్జన పడుతుండగా ఒక పిచ్చుక ఎక్కడి నుండో ఎగిరి వచ్చి ముక్కుతో దాన్ని పొడిచింది. అది చూసి వాళ్లు దాన్ని గోధుమ గింజ అని నిర్దారించేశారు. అయితే రాజు దాన్ని చూసి ఇలాంటి గోధుమలు ఎక్కడ పండేవో నుక్కోండి అని రైతులకు ఆదేశాలు పంపించాడు. ఒక ముసలి రైతు వచ్చి మా తాత గారి కాలంలో వీటిని పండించేవారట ప్రభూ! అని చెప్పాడు. ఆయనను తీసుకురమ్మనగా భటులు ఆ ముసలి తాతను తీసుకుని వచ్చారు. రాజు తాతతో ఇవి ఎక్కడ పండించేవారనగా ఆ రోజుల్లోని నేలపై ఎక్కడైనా మేం ఈ గోధుమల్ని పండించేవాళ్లం. అప్పుడు రైతు శ్రమను నమ్ముకునేవాడు. ఏదీ ఇది నా పొలం,నా భూమి అని ఏం ఉండేది కాదు. ఎవరైనా సాగు చేసి గింజలు తీసుకునేవాళ్లం. ఆ రోజుల్లో అన్నాన్ని, బియ్యాన్ని అమ్మడం, కొనడం అనేది ఉండేది కాదు. ఎవరి మనసులోనూ కల్మషాలే ఉండేవి కావు. ధనిక, పేద బేధాలే ఉండేవి కావు అంతే ప్రభూ అదే మా పెట్టుబడి. మా బలం అన్నాడు. రాజు ఆయన మాటలకు ఎంతో సంతోషించి అలాంటి రోజుల్ని మళ్లీ తీసుకురాగలిగితే నేనెంత ధన్యున్ని అవుతానో కదా అని భ్రమించాడు. అది భ్రమే కానీ.. నిజం ఎన్నటికీ కాదు అని మిన్నకుండిపోయాడు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







