బీట్రూట్ కొబ్బరి బర్ఫీ
- August 28, 2015
కావలిసిన పదార్ధాలు
కొబ్బరి తురుము - కప్పు
పంచదార - ఒకటిన్నర కప్పు
మంచి నీళ్లు - కప్పు
క్యారెట్, బీట్రూట్ తురుము - ఒక కప్పు
యాలకుల పొడి - సరిపడా
కుంకుమ పువ్వు - కొద్దిగా
పాలు - అర కప్పు
జీడిపప్పు, బాదం పప్పు ఒక్కొక్క స్పూను చొప్పున నేతిలో వేయించి పొడిగా చేయాలి.
నెయ్యి - 100 గ్రా
తయారీ విధానం
గోరువెచ్చని పాలల్లో కుంకుమ పువ్వు వేసి కరిగించాలి. బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి కొబ్బరి తురుము తడి పోయేవరకూ వేయించి, మరో పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి బీట్రూట్, క్యారెట్ తురుము వేసి ఐదు నిముషాలు వేయించాలి.మందపాటి గిన్నెలో పంచదార వేసి పాకం పట్టాలి. అందులోనే కొబ్బరితురుము, క్యారెట్, బీట్రూట్ తురుము వేసి ఉడికించాలి. ఇప్పుడు కుంకుమ పువ్వు కలిపిన పాలు, నెయ్యి కూడా వేస్తూ కలపాలి. ఇప్పుడు యాలకుల పొడి, జీడిపప్పు పొడి వేసి బాగా కలుపుతూ, దగ్గరికి అయ్యే వరకూ ఉడికించి నెయ్యి రాసిన ప్లేటులోనికి తీసుకుని సమంగా సర్ది పైన మిగిలిన డ్రైఫ్రూట్స్ అన్నీ వేసి, ఆరాకా ముక్కలుగా కోయాలి. అంతే బీట్రూట్ కొబ్బరి బర్ఫీ రెడీ.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







