ఆస్కార్ రేసు లో 'బాహు'
- August 28, 2015
తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి ఆస్కార్ రేసులో ఉంది. ప్రముఖ దర్శకుడు అమోల్ పాలేకర్ నేతృత్వంలో ఆస్కార్ ఎంపిక ప్యానల్‌లో ఉన్న ఐదుగురు సభ్యులు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు. వారు భారత్ తరఫున ఆస్కార్ అకాడమీ అవార్డుల నామినేషన్స్‌కి పంపాల్సిన 45 సినిమాలను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఆస్కార్‌కు నామినేట్ చేయాలని మన తెలుగు చాంబర్ ఆఫ్ కామర్స్ వారు టాలీవుడ్ నుంచి 'బాహుబలి'ని అధికారిక ఎంట్రీగా అస్కార్ ప్యానల్‌కు పంపారు. ఆస్కార్ ప్యానల్ కూడా 'బాహుబలి' సినిమాను ఆస్కార్ నామినేషన్స్‌కి పంపించడానికి గ్రీన్ సిగల్ ఇచ్చారు. ఈ ఏడాది ఆస్కార్‌కు వెళుతున్న బాలీవుడ్ సినిమాలు అమీర్ ఖాన్ చిత్రం 'పికె', అనురాగ్ కశ్యప్ సినిమా 'అగ్లీ', విశాల్ భరద్వాజ్ ' హైదర్', ప్రియాంకా చోప్రా ' మేరీ కోమ్'. ఈ చిత్రాల జాబితాలో మన 'బాహుబలి' సినిమా కూడా పోటీ పడుతుంది. కె.విశ్వనాథ్ -కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన ' స్వాతి ముత్యం' చిత్రం తర్వాత తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఆస్కార్‌కు వెళ్లనున్న మరొక సినిమా 'బాహుబలి' కావడం విశేషం.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







