బీట్‌రూట్‌ కొబ్బరి బర్ఫీ

- August 28, 2015 , by Maagulf
బీట్‌రూట్‌ కొబ్బరి బర్ఫీ

కావలిసిన పదార్ధాలు 

కొబ్బరి తురుము - కప్పు 

పంచదార - ఒకటిన్నర కప్పు 

మంచి నీళ్లు - కప్పు 

క్యారెట్‌బీట్‌రూట్‌ తురుము - ఒక కప్పు 

యాలకుల పొడి - సరిపడా 

కుంకుమ పువ్వు - కొద్దిగా 

పాలు - అర కప్పు 

జీడిపప్పుబాదం పప్పు ఒక్కొక్క స్పూను చొప్పున నేతిలో వేయించి పొడిగా చేయాలి. 

నెయ్యి - 100 గ్రా 

తయారీ విధానం 

గోరువెచ్చని పాలల్లో కుంకుమ పువ్వు వేసి కరిగించాలి. బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి కొబ్బరి తురుము తడి పోయేవరకూ వేయించిమరో పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి బీట్‌రూట్‌క్యారెట్‌ తురుము వేసి ఐదు నిముషాలు వేయించాలి.మందపాటి గిన్నెలో పంచదార వేసి పాకం పట్టాలి. అందులోనే కొబ్బరితురుముక్యారెట్‌బీట్‌రూట్‌ తురుము వేసి ఉడికించాలి. ఇప్పుడు కుంకుమ పువ్వు కలిపిన పాలునెయ్యి కూడా వేస్తూ కలపాలి. ఇప్పుడు యాలకుల పొడిజీడిపప్పు పొడి వేసి బాగా కలుపుతూదగ్గరికి అయ్యే వరకూ ఉడికించి నెయ్యి రాసిన ప్లేటులోనికి తీసుకుని సమంగా సర్ది పైన మిగిలిన డ్రైఫ్రూట్స్‌ అన్నీ వేసిఆరాకా ముక్కలుగా కోయాలి. అంతే బీట్‌రూట్‌ కొబ్బరి బర్ఫీ రెడీ. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com