మార్కెట్‌లో స్థానిక కూరగాయలు: తగ్గిన ధరలు

- November 13, 2016 , by Maagulf
మార్కెట్‌లో స్థానిక కూరగాయలు: తగ్గిన ధరలు

ఖతార్‌లో స్థానికంగా కూరగాయల సాగు ఎక్కువగా జరుగుతుండడం, స్థానిక ఉత్పత్తి పెరగడంతో మార్కెట్‌లో కూరగాయల ధరలు బాగా తగ్గాయి. వాతావరణం కూడా ఖతారీ రైతుల వ్యవసాయానికి అనుకూలంగా ఉండటంతో కూరగాయల ఉత్పత్తి పెరిగినట్లు స్థానికంగా అభిప్రాయాలు వినవస్తున్నాయి. మూడు కిలోల గ్రీన్‌ బీన్స్‌ గతంలో 33 ఖతారీ రియాల్స్‌ ఉంటే, అదిప్పుడు కేవలం 12 ఖతారీ రియాల్స్‌ మాత్రమే ధర పలుకుతున్నట్లు వ్యాపారులు వివరించారు. సెంట్రల్‌ మార్కెట్‌లోని ధర ఇది. ఔట్‌లెట్స్‌లో కూరగాయలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. లీఫీ వెజిటబుల్స్‌ కూవలం 2 నుంచి 7 ఖతారీ రియాల్స్‌ మధ్యనే దొరుకుతున్నాయి. ఎగ్‌ ప్లాంట్‌, బాటిల్‌ గార్డ్‌, కుకుంబర్‌ వంటివి 5 - 7 కిలోల బాక్స్‌ 8 - 12 ఖతారీ రియాల్స్‌కి లభ్యమవుతున్నాయి. స్థానికంగా పండిస్తున్న కూరగాయల పట్ల వినియోగదారులు కూడా ప్రత్యేకమైన ఆసక్తి చూపించడం జరుగుతోంది. స్థానిక వ్యాపారుల నుంచి సరుకు వచ్చిన తర్వాత మార్కెట్‌కి వినియోగదారుల సంఖ్య బాగా పెరిగిందని వ్యాపారులు చెప్పారు. సెంట్రల్‌ మార్కెట్‌ వినియోగదారుల తాకిడితో ఉక్కిరిబిక్కిరవుతోంది. వ్యాపారులు, వినియోగదారులు, రైతులు కూడా ఈ సానుకూల పరిస్థితుల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com