గ్యాడ్జెట్స్ వినియోగంపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి
- November 13, 2016
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. చిన్నారులకు కూడా అనేక గ్యాడ్జెట్స్ అందుబాటులోకి వచ్చేశాయి. కొత్త గ్యాడ్జెట్స్‌ని పిల్లలకు అలవాటు చేయడం అనేది ఓ ప్రెస్టేజ్ ఇష్యూగా మారిపోయింది. అయితే ఈ గ్యాడ్జెట్స్ వినియోగం తగ్గించవలసి ఉందని సైకియాట్రిస్ట్‌లు, పసిపిల్లల మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫిజికల్ యాక్టివిటీస్ పెంచడం ద్వారా పసిపిల్లల్లో మానసిక ఎదుగుదల ఉంటుందనీ, గ్యాడ్జెట్స్‌కే వారిని పరిమితం చేస్తే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వారు హెచ్చరించారు. ఖతార్‌లో ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ మోజా అల్ మల్కి మాట్లాడుతూ, టెక్నాలజీ ద్వారా ఎదురయ్యే సానుకూలతలు, వ్యతిరేకతలు తెలుసుకుని తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించవలసి ఉంటుందన్నారు. భోజన సమయాల్లో టీవీ చూడకపోవడం, ప్రతిరోజూ కొంత సమయం పాటు మాత్రమే కంప్యూటర్ వినియోగించడం వంటి చర్యలు పెద్దలు పాటిస్తే, తద్వారా పిల్లల్లో కూడా మంచి అలవాట్లు పెరుగుతాయని ఆయన చెప్పారు. ఉమ్ అల్ హయా ప్రాంతానికి చెందిన ఓ మహిళ, తన ముగ్గురు కుమారులు యూ ట్యూబ్‌కి అలవాటుపడ్డారనీ, అందులో అడల్ట్ కంటెంట్ ఉంటోందని వాపోయారు. వారి వద్దనుంచి స్మార్ట్ ఫోన్‌స, ల్యాప్‌టాప్స్ మరియు ఐపాడ్స్‌ని తీసుకుని, దూరం పెట్టినట్లు వివరించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







