గద్దెనెక్కిన తొలిరోజే అక్రమ వలసదారులను తరిమేస్తా
- November 13, 2016
అమెరికాలోని అక్రమ వలసదారులపై కఠిన వైఖరితో ఉన్న కాబోయే దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పెద్ద బాంబే పేల్చారు. చట్టవిరుద్ధంగా నివసిస్తున్న 30 లక్షల మంది విదేశీయులను తాను గద్దెనెక్కిన మరుక్షణమే పంపేస్తానని ప్రకటించారు. 'నేరగాళ్లు, నేరచరిత ఉన్న వాళ్లు, గ్యాంగ్స్టర్లు, డ్రగ్డీలర్లు 20-30 లక్షల మంది ఉన్నారు. వారిని స్వదేశాలకు పంపుతాం లేదంటే నిర్బంధిస్తాం' అని సీబీఎస్ న్యూస్ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. సోమవారం ప్రసారం కానున్న ఈ ఇంటర్వ్యూలోని పలు అంశాలను ఆ చానెల్ వెల్లడించింది మెక్సికో నుంచి క్రిమినల్స్, డ్రగ్స్‌ను అరికట్టేందుకు సరిహద్దులో గోడ నిర్మాణం ఖాయమని తేల్చిచెప్పారు. కాగా.. ట్రంప్ పార్టీకే చెందిన సీనియర్ నేత, అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ పాల్ రియాన్ ట్రంప్ నిర్ణయంతో విభేదించారు. డాక్యుమెంట్లు లేని, చట్టవిరుద్ధ వలసదారులను నిర్బంధించి స్వదేశాలకు పంపేందుకు కాంగ్రెస్ సభ్యులు సిద్ధంగా లేరని, ట్రంప్ ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయడం లేదని సీఎన్ఎన్తో చెప్పారు. కాగా.. సరిహద్దులో గోడ నిర్మాణానికి తాము పైసా కూడా చెల్లించేది లేదని మెక్సికో పునరుద్ఘాటించింది. కాగా, తన విజయంలో సోషల్ మీడియాలైన ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కీలక పాత్ర పోషించాయని ట్రంప్ పేర్కొన్నారు. హిల్లరీ హుందాతనం, శక్తిమంతమైన, తెలివిగల నాయకురాలని అన్నారు. ఓడిన తర్వాత ఆమె ఎంతో మర్యాదగా ఫోన్ చేశారని చెప్పారు. అట్టుడుకుతున్న అమెరికా అమెరికాలో నిరసనల మంటలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. ట్రంప్ విజయాన్ని సహించలేని డెమోక్రాటిక్ పార్టీ మద్దతుదారులు, ఓడిన హిల్లరీ క్లింటన్ అభిమానులు, పలువురు సెలబ్రిటీలు ఆందోళనలకు దిగుతున్నారు. నాలుగు రోజుల నుంచి జరుగుతున్న నిరసనలు ఇతర నగరాలకు విస్తరిస్తున్నాయి. న్యూయార్క్, షికాగో వంటి పెద్ద నగరాలతో పాటు వర్సెస్టర్, మసాచుసెట్స్, అయోవా సిటీ వంటి చిన్న నగరాల్లోనూ జరుగుతున్నాయి. జర్మనీ వంటి దేశాల్లో కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. నాలుగు రోజుల్లో 200 ద్వేషపూరిత ఘటనలు జరిగాయని సదరన్ పావర్టీ లా సెంటర్ అధ్యక్షుడు రిచర్డ్ కోహెన్ తెలిపారు.
ఎఫ్‌బీఐ డైరెక్టరే సైంధవుడు: హిల్లరీ 'నా ఓటమికి చాలా కారణాలున్నాయి. చివరి అడుగులో ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమీ అడ్డుపడ్డారు. ఈ-మెయిల్స్ స్కాంపై కొత్త ఆధారాలు దొరికాయని, పునర్విచారణకు ఆదేశించినట్లు కాంగ్రెస్ నేతలకు లేఖ రాశారు. ఆ సందేహాలు నిరాధారమైనవి. డైరెక్టర్ కోమీ మా గమనాన్ని నిరోధించి నా చరిత్రాత్మక విజయాన్ని అడ్డుకున్నారు' అని డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ వాపోయారు. అధ్యక్ష ఎన్నికల్లో పరాజయం పాలైన ఆమె.. శనివారం తన ప్రచారానికి విరాళాలు సేకరించినవారు, దాతలతో వాషింగ్టన్లో భేటీ అయ్యారు. అన్ని రాషా్ట్రల్లో పుంజుకున్నా.. ఫ్లోరిడా, పెన్సిల్వేనియా, మిచిగాన్లలో దెబ్బతినడంతో పరాజయం పాలయ్యామని తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









