ఉల్లంఘనకు పాల్పడ్డ స్కూల్‌కి ఫైనల్‌ వార్నింగ్‌

- November 13, 2016 , by Maagulf
ఉల్లంఘనకు పాల్పడ్డ స్కూల్‌కి ఫైనల్‌ వార్నింగ్‌

మనామా: క్యాపిటల్‌ గవర్నరేట్‌ పరిధిలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌కి ఫైనల్‌ వార్నింగ్‌ ఇచ్చారు ఎడ్యుకేషనల్‌ అథారిటీస్‌ వర్గాలు. నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఇది చాలా సీరియస్‌ వార్నింగ్‌గా పరిగణించాలి. ఎడ్యుకేషన్‌ మినిస్ట్రీ జారీ చేసిన స్టేట్‌మెంట్‌ ప్రకారం మోడర్న్‌ నాలెడ్జ్‌ స్కూల్‌ (ఎంకెఎస్‌), నాన్‌ బహ్రెయినీ టీచర్లను నియమించడం ద్వారా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు తెలియవస్తోంది. కరికులంలో లేని అకడమిక్‌ మెటీరియల్‌ని ఇక్కడ బోదించబడ్తున్నట్లుగా మినిస్ట్రీ వెల్లడించింది. ఉల్లంఘనలపై వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఫైనల్‌ వార్నింగ్‌ అందుకున్న స్కూల్‌ యాజమాన్యం. లేని పక్షంలో స్కూలు పూర్తిగా మినిస్ట్రీ పర్యవేక్షణలోకి వెళ్ళిపోతుంది. ఎక్కువ సమయం జూనియర్‌ స్టూడెంట్స్‌ని ఎండలో నిల్చోబెట్టడం, పుస్తకాల ధరల పెంపు, స్కూల్‌లో కెఫిటేరియా నిర్వహించకపోవడం, స్పోర్ట్స్‌ యూనిఫామ్‌పై స్కూల్‌ పేరెంట్స్‌కి సమాచారం అందివ్వకపోవడం వంటి ఉల్లంఘనలకు ఈ స్కూల్‌ గతంలో పాల్పడింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com