ఇరాక్-సిరియా ప్రాంతంలో ఓ భారతీయ జంట...
- November 14, 2016
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రాబల్యంగల ఇరాక్-సిరియా ప్రాంతంలో ఓ భారతీయ జంట కనిపించిందని ఇటీవలే పట్టుబడిన ఆ సంస్థ ఉగ్రవాది సుబహాని హాజా మొయిదీన్ (31) తెలిపాడు. తమిళనాడుకు చెందిన సుబహానిని అక్టోబరు 6న ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. సుబహాని ఐఎస్ ప్రాబల్య ప్రాంతంలో ఐదు నెలలపాటు ఉన్నాడు. ఆ సంస్థ తరపున మోసుల్లో పోరాడాడు. బీజేపీ, ఆరెస్సెస్ నేతలు, హైకోర్టు న్యాయమూర్తులపై దాడులకు పాల్పడేందుకు ఐఎస్ ప్రేరణతో ఆరుగురు కేరళవాసులు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై నమోదైన కేసును దర్యాప్తు చేస్తున్నపుడు సుబహానిని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. సుబహాని శివకాశి నుంచి పేలుడు పదార్థాలను సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తూండగా అరెస్టు చేశారు.అతనిని విచారించినపుడు తాను ఐఎస్ యుద్ధ భూమిలో మహారాష్ట్రకు చెందిన ఒక మహిళ, ఒక పురుషుడిని చూశానని, ఆ మహిళతో ఓ బహిరంగ ప్రదేశంలో మాట్లాడానని చెప్పినట్లు ఎన్ఐఏ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటి వరకు భారతీయ మహిళలు ఐఎస్లో ఉన్నట్లు పక్కా సమాచారం లేదని, సుబహాని చెప్తున్న మహిళ గురించి మాత్రమే తెలిసిందని వివరించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









