రద్దయిన నోట్లను 24 వరకూ అనుమతించాలని నిర్ణయించిన ఇండియన్ రైల్వేస్

- November 14, 2016 , by Maagulf
రద్దయిన నోట్లను 24 వరకూ అనుమతించాలని నిర్ణయించిన ఇండియన్ రైల్వేస్

పెద్ద నోట్ల రద్దుపై ఇండియన్ రైల్వేస్ సంచలన నిర్ణయం తీసుకుంది. రద్దయిన ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లను ఈ నెల 24 వరకూ అనుమతించాలని నిర్ణయించింది. రిజర్వేషన్లు, టికెట్ల బుకింగ్‌, రైల్వే క్యాటరింగ్ సర్వీసులకు పాత నోట్లను ఈ నెల 24వరకూ అనుమతించనున్నారు. వాస్తవానికి టికెట్ల కొనుగోలుకు పాత నోట్లను నేటి అర్ధరాత్రి వరకూ అనుమతిస్తూ గతంలోనే నిర్ణయించారు. అయితే తాజాగా ఈ నెల 24 వరకూ దీన్ని పొడిగించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com