సీఎం కేసీఆర్‌ను కలిసిన నాగ్

- November 14, 2016 , by Maagulf
సీఎం కేసీఆర్‌ను కలిసిన నాగ్

ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావును కలిశారు. సోమవారం సాయంత్రం కేసీఆర్‌ నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. నాగార్జున తన కుమారుడు అఖిల్‌ నిశ్చితార్థానికి కేసీఆర్‌ను ఆహ్వానించారు.

ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే మనవరాలు.. సోమనాద్రి భూపాల్, షాలినీ దంపతుల కుమార్తె శ్రీయా భూపాల్తో అఖిల్‌ నిశ్చితార్థం జరగనుంది. డిసెంబర్ 9వ తేదీ సాయంత్రం 7 గంటలకు జీవీకే ఇంట్లో నిశ్చితార్థం జరగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com