బాగ్దాద్‌లో ఆత్మాహుతి దాడి పౌరులు, మిలిటెంట్లు మృతి

- November 14, 2016 , by Maagulf
బాగ్దాద్‌లో ఆత్మాహుతి దాడి పౌరులు, మిలిటెంట్లు మృతి

ఇరాక్‌లో సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో ఆరుగురు పౌరులు, ఆరుగురు మిలిటెంట్లు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. అయిన్‌ ఆల్‌తామర్‌ అనే పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక నివాస భవనంలోకి ఆరుగురు మిలిటెంట్లు ప్రవేశించగా వారిలో ఐదుగురిని భద్రతా సిబ్బంది కాల్చి చంపారు. ఇంకొక మిలిటెంట్‌ ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో ఆరుగురు పౌరులు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com