విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ల పై తాజా నిర్ణయం
- November 14, 2016
పెద్దనోట్ల రద్దుతో దేశంలో నగదు కష్టాలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే స్టేషన్లలో పాత నోట్లను అంగీకరించే గడువును ఈ నెల 24వ తేదీ అర్ధరాత్రి వరకు పొడిగించింది. అదేవిధంగా విమానాశ్రయాల్లోనూ పార్కింగ్ చార్జీల రద్దును ఈ నెల 21 అర్ధరాత్రి వరకు కొనసాగిస్తున్నట్టు తెలిపింది.
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకూడదన్న ఉద్దేశంతో పార్కింగ్ చార్జీల రద్దును ఈ నెల 21వరకు కొనసాగిస్తున్నట్టు పౌరవిమానయానశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఈ నెల 24వ తేదీ అర్ధరాత్రి వరకు పాతనోట్లను అన్నీ రైల్వేస్టేషన్లలో యథాతథంగా అంగీకరిస్తామని, అదేవిధంగా ప్రయాణసమయంలో క్యాటరింగ్ సేవలకు కూడా పాతనోట్లను వినియోగించవచ్చునని రైల్వేశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.ఇక అన్నీ జాతీయ రహదారులపైనా టోల్ రుసుమును ఈ నెల 24వరకు రద్దుచేసిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







