హోటల్‌లో స్పైయింగ్: టీవీ దొంగతనం
- November 15, 2016
మనామా: మనామాలోని ఓ ఫైవ్ స్టార్‌లో బస చేసిన గల్ఫ్ జాతీయుడొకరు, ఆ హోటల్ నుంచి టీవీ స్క్రీన్‌ని దొంగిలించాడు. దానికి కారణాన్ని వివరిస్తూ, హోటల్‌లోని బాత్రూమ్‌లో స్పైయింగ్ కెమెరా ఫిక్స్ చేశారనీ, దాని ద్వారా రహస్యంగా వీడియోలను చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ, హోటల్ పేరుని 'డైమండ్'గా అభివర్ణించాడు. దాంతో, హోటల్ యాజమాన్యం అప్రమత్తమయ్యింది. ఇదంతా తమపై జరుగుతున్న దుష్ప్రచారం అనీ, ఆ వ్యక్తి చేసిన దొంగతనంపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నామని తెలిపింది ఆ హోటల్ యాజమాన్యం. సదరు వ్యక్తి మాత్రం తనకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకుండా ఉండాలనే తాను ఈ పని చేశాననీ, దీనికి సంబంధించి పూర్తి విషయాల్ని వీడియో ద్వారా విడుదల చేసినట్లు చెప్పాడు. అన్ని గెస్ట్ రూమ్స్‌లోనూ బాత్ టీవీలను ఉంచుతామనీ, దీనికి ఇంటీరియర్ మినిస్ట్రీ నుంచి కూడా క్లియరెన్స్ ఉందనీ, తమ హోటల్‌కి వచ్చేవారి భద్రత, ప్రైవసీకి పూర్తి భరోసా ఇస్తున్నామని హోటల్ యాజమాన్యం స్పష్టం చేసింది. అయితే సెక్యూరిటీ అథారిటీస్ ఇప్పటివరకు ఈ ఘటనపై స్పందించలేదు.
తాజా వార్తలు
- అత్యంత వైభవంగా గీతం 17వ స్నాతకోత్సవం
- NEET UG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- అమెరికా వీసాల పై ట్రంప్ సర్కార్ కఠిన నిర్ణయం
- కేరళ: కొండచరియలు విరిగిపడి 8 మంది మృతి..
- లండన్‌లోని ప్రముఖ రెస్టారెంట్లో షేక్ మొహమ్మద్ సందడి..
- బాక్సింగ్‌లో ఏకంగా 7 స్వర్ణాలు సాధించిన భారత్!
- జలీబ్లో ఉక్కుపాదం.. 1,253 మంది అరెస్ట్..!!
- ఒమాన్‌లో ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చిన కీలక మార్పులు..!!
- అమెరికాలో సౌదీ రక్షణ శాఖ సహాయ మంత్రి..కీలక చర్చలు..!!
- ఘనంగా ప్రారంభమైన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు..







