రెడ్ సీ అడుగున సుల్తాన్ కబూస్ చిత్రపట ఆవిష్కరణ
- November 16, 2016
ఒమన్ 46వ జాతీయ దినోత్సవం నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా అల్ గైలాని మరియు టీమ్ సౌదీ అరేబియా తీరంలో రెడ్ సీ అడుగున సుల్తాన్ కబూస్ బిన్ సైద్ చిత్రపటాన్ని అలాగే ఒమన్ జాతీయ పతాకాన్నీ ఆవిష్కరించారు. మెరిటైమ్ హెరిటేజ్‌ని సంరక్షించడంలో భాగంగా తాము ఈ ఫీట్ నిర్వహించినట్లు ఒమర్ అబ్దుల్లా అల్ గైలాని చెప్పారు. ఈ ఫీట్ ద్వారా సుల్తానేట్‌లో డైవింగ్ పట్ల ఆసక్తి పెరుగుతుందని ఆశిస్తున్నామనీ, ఈ క్రీడకు ప్రాచుర్యం కల్పించాలనే తన లక్ష్యం నెరవేరుతుందనే ఆశాభావంతో ఉన్నామని అన్నారాయన. 20 డైవింగ్ అటెంప్ట్స్ తర్వాత సీ బెడ్‌కి చేరుకున్నామని, ఫొటోగ్రాఫ్ మరియు ఫ్లాగ్ కోసం 1,600 ఒమన్ రియాల్స్ ఖర్చయ్యిందని తెలిపారు. 2012లో ఈ గ్రూప్‌ని ఏర్పాటు చేశామని అన్నారు ఒమర్ అబ్దుల్లా. గత ఏడాది ఒమర్ అబ్దుల్లా టీమ్ ఈజిప్టియన్ సిటీ షార్మ్ ఎల్ షేక్‌లోని దహాబ్ ప్రాంతంలో ఒమనీ ఫ్లాగ్‌ని ఆవిష్కరించారు. ప్రతి సంవత్సరం ఓ దేశాన్ని ఎంచుకుని, సముద్రంలోకి వెళ్ళి నేషనల్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







