గ్రేడ్‌ 12 స్టూడెంట్స్‌కి డ్రైవింగ్‌ లైసెన్స్‌?

- November 16, 2016 , by Maagulf
గ్రేడ్‌ 12 స్టూడెంట్స్‌కి డ్రైవింగ్‌ లైసెన్స్‌?

రస్‌ అల్‌ ఖైమా సెకెండరీ స్కూల్‌ గ్రేడ్‌ 12 విద్యార్థులు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ విషయంలో ఎమిరేట్స్‌లో పుట్టినవారికి వెసులుబాటు కల్పించాల్సిందిగా ట్రాఫిక్‌ పోలీస్‌ విభాగానికి విజ్ఞప్తి చేశారు. యూఏఈ వ్యాప్తంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకునేవారికి మినిమమ్‌ వయసు 18 ఏళ్ళుగా నిర్ణయించబడింది. అయితే స్టూడెంట్స్‌ మాత్రం తమకు ఎగ్జంప్షన్‌ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. అలర్ట్‌ పేరుతో పోలీసులు నిర్వహించిన ప్రోగ్రామ్‌ సందర్భంగా ఈ విజ్ఞప్తిని విద్యార్థులు పోలీసుల ముందుకు తీసుకొచ్చారు. లైసెన్స్‌ లేకుండా రోడ్లపై వాహనాలు నడుపుతున్నవారిలో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే విద్యార్థుల విజ్ఞప్తి నేపథ్యంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌కి దరఖాస్తు చేసుకునే వయసుని 16 ఏళ్ళకు తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 16 ఏళ్ళు ఆ పైబడి వయసున్నవారికి ప్రత్యేక పరిస్థితుల్లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇస్తే మంచిదని గ్రేడ్‌ 12 స్టూడెంట్‌ ఖాలిద్‌ అల్‌ కాసిమి అభిప్రాయపడ్డాడు. ప్రత్యేకంగా ట్రైనింగ్‌ క్లాసులు తీసుకుని వాహనాలు నడుపుతామని, తమ లాంటివారికి లైసెన్సులు ఇవ్వడం వల్ల నష్టమేమీ ఉండదని విద్యార్థులు అంటున్నారు. యువత వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్బంగా బ్రిగేడియర్‌ డాక్టర్‌ మొహమ్మద్‌ సయీద్‌ అల్‌ హుమైది చెప్పారు. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నవారు, బాధితులు కూడా ఎక్కువగా యువతే ఉంటున్నారని అన్నారాయన. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com