'రోబో 2' తో బిజీ అయిపోయిన దర్శకుడు 'శంకర్'
- August 29, 2015
ఐ తరువాత ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తాడోనని ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఇండస్ట్రీకి, ఓ పెద్ద షాక్ ఇచ్చాడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సైంటిఫిక్ థ్రిల్లర్ రోబోకి సీక్వెల్ తీసే పనిలో బిజీగా ఉన్నాడు శంకర్. కలెక్షన్స్ విషయంలో రోబో వన్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. దీంతో అప్పట్లోనే రోబోకి సెకండ్ పార్ట్ ఉంటుందని ఎనౌన్స్ చేశాడు శంకర్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే బిజీగా ఉన్నాడట శంకర్. శంకర్ రోబో 2 ని స్టార్ట్ చేయడం ఒక విశేషమైతే, ఈ ప్రాజెక్ట్ లో నటించేందుకు హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్డ్ ష్వాజ్ నెగ్గర్ ముందుకి రావడం మరో విశేషం. ఐ మూవీ ఆడియో ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా ఆర్నాల్డ్ ఎంటరైన సంగతి తెలిసిందే. అంతేకాదు శంకర్ డైరెక్షన్ లో నటిస్తానని కూడా ఆర్నాల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. తాజాగా రోబో 2 లో కనిపించేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు. అయితే ఈ హాలీవుడ్ హీరో రోబో 2 లో ఎలాంటి గెటప్ లో కనిపించబోతున్నాడనేదే ఇండస్ట్రీకి ఇప్పుడు మిలియన్ డాలర్స్ క్వశ్చిన్. ఇది ఇలా ఉంటే ఈ విషయం పై రీసెంట్ గా కోలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆర్నాల్డ్ తన ఓన్ ఫ్రాంఛైజ్ అయిన టెర్మీనేటర్ గెటెప్ లోనే కనిపించబోతున్నాడట. మరి మన కోలీవుడ్ రోబోతో ఆ హాలీవుడ్ టెర్మీనేటర్ ఎలా పోటీపడతాడో వేచిచూడాలి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







