చేతన్‌, లతా హెగ్డే మహేష్‌ దర్శకత్వంలో....

- November 16, 2016 , by Maagulf
చేతన్‌, లతా హెగ్డే మహేష్‌ దర్శకత్వంలో....

చాముండి క్రియేషన్స్‌ పతాకంపై వేణుగోపాల్‌, మంజునాథ్‌ల నిర్మాణ సారథ్యంలో మహేష్‌ బాబు దర్శకత్వంలో సినిమా చిత్రీకరణ ఆరంభమైంది. దీనికి ఇంకా పేరుపెట్టలేదు. మైసూరులోని యోగా నరసింహస్వామి ఆలయంలో ముహూర్తం సన్నివేశాన్ని చిత్రీకరించారు. చేతన్‌, లతా హెగ్డే జంటగా నటిస్తున్నారు. అచ్యుత్‌కుమార్‌, అవినాశ్‌, సుధా బెళవాడి, రవిశంకర్‌గౌడ, రాబిన్‌సింగ్‌, సాధుకోకిలా, సునిల్‌ ప్రశాంత్‌ ప్రధాన తారాగణం. మైసూరు పరిసరాల్లో ఒకే షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తిచేయనున్నట్లు దర్శకుడు వెల్లడించారు. ఛాయాగ్రహణం- జై ఆనంద్‌, సంగీతం- సురాజ్‌ (సాధుకోకిల కుమారుడు).

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com