అమ్మ అభిమానులకు శుభవార్త
- November 19, 2016
తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్‌తో చెన్నై అపోలో ఆస్పత్రిలో సెప్టెంబర్ 22వ తేదీన చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను.. 58 రోజుల తర్వాత వైద్యులు సీసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలించారు. ఆమె ఆరోగ్యం చాలావరకు మెరుగుపడటంతో ఆమెను సాధారణ వార్డుకు తరలించినట్లు వైద్యులు తెలిపారు. వెంటిలేటర్ అవసరం లేకుండానే రోజుకు 20 గంటల పాటు సహజంగా శ్వాసను తీసుకునే స్థాయికి ఆమె ఆరోగ్యం పుంజుకోగా, నిద్రపోయేటపుడు మాత్రమే కృత్రిమశ్వాసను అందిస్తున్నట్లు చెబుతున్నారు. ఆస్పత్రిలో పడకపై కూర్చుని టీవీలు చూస్తున్నారని, పత్రికలను చదువుతున్నారని కూడా అపోలో వర్గాలు తెలిపాయి.
కాగా, ముఖ్యమంత్రి జయలలిత ఆస్పత్రి నుంచే పరిపాలన సాగిస్తున్నట్లు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొన్నాయి.జాలర్ల సమస్య, కావేరీ జల వివాదాలపై పార్లమెంటు సమావేశాల్లో స్పందించాల్సిన విధానంపై ఎంపీలకు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ కావాలో ఆమె అభీష్టానికే వదిలేసినట్లు అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







