నా కూతురు ఇప్పట్లో సినిమాల్లోకి రాదు.!
- November 20, 2016
హీరో కమల్‌హాసన్ నుండి తాను విడిపోతున్నానని నటి గౌతమీ ఇటివల ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే . దాదాపు 13 ఏళ్లు కమల్‌హాసన్‌తో ఆమె సహజీవనం చేశారు . అయితే ఇప్పుడు వారి మధ్య ఎలాంటి అభిప్రాయబేధాలు వచ్చాయో ఎవరి దారి వారు చూసుకున్నారు. ఈ విషయంలో కమల్ కూతురు శ్రుతి హాసన్ పై కొన్ని విమర్శలు వచ్చాయి. 'శభాష్‌నాయుడు' చిత్రం షూటింగ్ సమయంలో శ్రుతిహాసన్, గౌతమిల మధ్య విబేధాలు వచ్చాయని, ఈ విషయంలో కమల్ శ్రుతి వైపు నిలిచారని, ఇది కూడా కమల్, గౌతమి విడిపోవడానికి ఇదో కారణం ఏవో కధనాలు వినిపించాయి. ఏదేమైనా ఈ జంటవిడిపోయింది. తాజగా విషయానికి వస్తే.. గౌతమి కుమార్తె సుబ్బలక్ష్మి త్వరలో హీరోయిన్ గా వస్తుందని వార్తలు వచ్చాయి.
సుబ్బలక్ష్మి ని హీరోయిన్‌గా పరిచయం చేయమని పలువురు ప్రముహులతో గౌతమి సంప్రతింపులు జరిపారని వార్తలు వెలువడ్డాయి. అయితే ఇవన్నీ రుమర్లె. ''నా బేబీ ఇండస్ట్రీకి రావాలని ఆకాంక్షిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. కానీ, అది నిజం కాదు. ప్రస్తుతం తన దృష్టి చదువు మీదే. యాక్టింగ్ ప్లాన్స్ లేవు" అని క్లారీటీ ఇచ్చింది గౌతమీ.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







