ప్రశాంతి నిలయంలో భక్తులను ఓలలాడించిన ఫణికుమార్ బృందం

- November 20, 2016 , by Maagulf
ప్రశాంతి నిలయంలో భక్తులను ఓలలాడించిన ఫణికుమార్ బృందం

ప్రశాంతి నిలయంలో ఆలపించిన మురళీగానం భక్తులను ఓలలాడించింది. శుక్రవారం సత్యసాయి జయంతి వేడుకలను పురస్కరించుకొని గురజ ద్రోనేంద్ర ఫణికుమార్ బృందం కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీతో వేలాదిమందిని మైమరపించారు. కర్ణాటక శాస్త్రీయ సంగీతగానకచేరి, మురళీగానం ఆలపించి, భక్తులను తన్మయత్వంలో ఓలలాడించించారు. జై గణేషా, జై జై గణేషా, ఎందరో మహానుభావులు వంటి కీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. భక్తులు సంయుక్తంగా సత్యసాయి భక్తిగీతాలు ఆలపించారు. సంగీత కచేరీ నిర్వహించిన భక్తబృందాన్ని ట్రస్టు సభ్యడు ఆర్. జేరత్నాకర్, ప్రశాంతి కౌన్సిల్ చైర్మన్ నరేంద్ర రెడ్డి సన్మానించారు.

https://www.youtube.com/watch?v=-HP1lUrPbCU​

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com