బోయపాటి శ్రీనుతో 151వ సినిమా చేయనున్న చిరు
- November 20, 2016
'ఖైదీ నెంబర్ 150' మూవీ తర్వాత చిరంజీవి నెక్ట్స్ ఏ దర్శకుడితో చేయనున్నాడు? ఆ మధ్య బోయపాటి శ్రీనుతో 151వ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనికి సంబంధించి కొత్తన్యూస్. బోయపాటితో చేసేందుకు చిరంజీవి దాదాపుగా ఓకే చేశాడని, గీతాఆర్ట్స్ బ్యానర్లో దీన్ని తెరకెక్కించనున్నారట. అంతా ఓకే అయితే ఏప్రిల్‌లో పూజా కార్యక్రమాలు చేసి, మే నుంచి రెగ్యులర్‌గా చిత్రీకరణ జరపాలన్నది ఆలోచన. ప్రస్తుతం స్టోరీ పనుల్లో ప్రొడ్యూసర్- బోయపాటి బిజీగా వున్నారట. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దీన్ని ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు బెల్లంకొండ శ్రీనివాస్ - బెల్లంకొండ ప్రాజెక్ట్ షూటింగ్ హైదరాబాద్ శివార్లలో చిత్రీకరణ జరుగుతోంది. కీలకమైన సీన్స్ కోసం యూనిట్ జనవరిలో బ్యాంకాక్ వెళ్లనుంది. మార్చిలోపు ఈ చిత్రాన్ని షినిష్ చేయాలని భావిస్తున్నాడట బోయపాటి. ఆ తర్వాత చిరు ప్రాజెక్ట్‌ని చేయనున్నట్లు బోయపాటి సన్నిహితులు చెబుతున్నమాట.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







