శ్రీశ్రీ రవిశంకర్‌కు 'అంతర్జాతీయ శాంతి పురస్కారం'

- November 20, 2016 , by Maagulf
శ్రీశ్రీ రవిశంకర్‌కు 'అంతర్జాతీయ శాంతి పురస్కారం'

ఆర్ట్‌ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌కు మరో గౌరవం దక్కింది. ప్రపంచ శాంతికి కృషి చేస్తున్న గుర్తింపునకు గాను డాక్టర్‌ నరేంద్రసింగ్‌ అంతర్జాతీయ శాంతి పురస్కారాన్ని ప్రదానం చేశారు. దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో అంతర్జాతీయ గుడ్‌విల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా, రాష్ట్ర నిర్మాణ్‌ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చేతుల మీదుగా అందజేశారు. జీవన సాఫల్య విధానం ద్వారా మానసిక ఒత్తిడులను తగ్గించడం సహా దేశాల మధ్య శాంతిని నెలకొల్పినందుకు రవిశంకర్‌కు ఈ అవార్డును ప్రదానం చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com