యూరప్ లో రెండు పాటలు పూర్తిచేసుకున్న"ఖైదీ నంబర్ 150"
- November 21, 2016
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ నాయకానాయికలుగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో "ఖైదీ నంబర్ 150" వ సినిమా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో పలు కీలక సన్నివేశాలను తెరకెక్కించిన టీమ్ ఇటీవలే పాటల చిత్రణకు యూరప్ వెళ్లింది. అక్కడ క్రొయేషియా, స్లోవేనియా వంటి ఎగ్జాటిక్ లొకేషన్లలో చిత్రీకరణ చేశారు. తాజాగా టీమ్ ఆ పనులను కూడా పూర్తి చేసుకుని హైదరాబాద్ తిరిగి వచ్చేసింది.
ఆ రెండు పాటలు మెగాస్టార్ స్టైల్ కు ఏ మాత్రం తగ్గకుండా ఉంటాయని యూనిట్ చెబుతోంది. యంగ్ కొరియోగ్రఫర్స్ శేఖర్, జానీ మాస్టర్ నేతృత్వంలో కంపోజ్ అయిన పాటల్లో మెగాస్టార్ స్టెప్పులు ఫ్యాన్స్ కు కిక్కెంచడం షురూ అని మాష్టర్లు దీమా వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవితో కలిసి పనిచేసే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న ఈ యువ టెక్నిషీయన్స్ ఆనందంతో ఉబ్బితబ్బితున్నారు. మెగాస్టార్ మూవీకు పనిచేయడంతో జీవితానికి ఓ అర్ధం వచ్చిందని జానీ మాష్టర్ ఆనందం వ్యక్తం చేశారు. ఇక తదుపరి మిగిలిన షూటింగ్ పార్టుపై టీమ్ బిజీ కానుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







