ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో ఆరు భాషల్లో శృంగారభరిత చిత్రం `రతి`
- November 21, 2016
ఎమ్మెస్ రాజు అనే పేరు తెలుగు సినిమాల్లో ఒక బ్రాండ్. ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలతో నిర్మాతగా ప్రత్యేకతను సొంతం చేసుకున్న ఆయన అభిరుచి గల దర్శకుడిగానూ పేరు తెచ్చుకున్నారు. . ఎలాంటి సన్నివేశాన్ని తెరకెక్కించినా కళ్లకు అందంగా ఉండటంతో పాటు మనసుకు ఆహ్లాదాన్ని కలిగించి, ఆలోచింపజేయడం ఎమ్మెస్ రాజు ప్రత్యేకత. అలాంటి ఆయన తాజాగా మరో వినూత్నమైన శృంగారభరితమైన చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. ఆ చిత్రానికి `రతి` అనే పేరు పెట్టారు. ఆరు భాషల్లో తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం నటీనటుల్ని ఎంపిక చేస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీతో పాటు మరాఠీలోనూ ఆ చిత్రాన్ని తెరకెక్కించడానికి సర్వసన్నాహాలు చేసుకున్నారు ఎమ్మెస్ రాజు. ఇప్పటి వరకు అతి కొద్ది మంది దర్శకులు, అందులోనూ అగ్ర దర్శకులు మాత్రమే స్పృశించిన వైవిధ్యమైన కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించడానికి ఆయన సిద్ధమయ్యారు. తమిళంలో బాలచందర్, శ్రీధర్, మలయాళంలో భరతన్, కన్నడలో పుట్టణ్ణ కణగళ్ వంటి గొప్ప దర్శకులు ఈ జోనర్‌లో చిత్రాలను తెరకెక్కించారు. అలాంటి పటిష్టమైన, సౌందర్యాత్మకమైన, కళ్లకు కట్టినట్టుండే కావ్యాత్మకమైన కథతో ఈ తాజా చిత్రాన్ని తెరకెక్కించడానికి ఎమ్మెస్ రాజు సంసిద్ధులయ్యారు. ఈ చిత్రం షూటింగ్ ఫిబ్రవరి నుంచి మొదలుకానుంది.
ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ ``శృంగారభరితంగా సాగే వినూత్నమైన చిత్రమిది. `రతి` అనే టైటిల్, ఈ నేపథ్యం విన్న వారందరికీ కొత్తగా అనిపిస్తుంది.ఆరు భాషల్లో తెరకెక్కిస్తున్నాం. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీతో పాటు మరాఠీలోనూ సినిమాను రూపొందిస్తాం. సౌందర్యాత్మకంగా కనిపిస్తూ, పొయిటిగ్గా సాగే చిత్రమిది. నేను ఇప్పటిదాకా ఇలాంటి నేపథ్యం ఉన్న కథతో సినిమా చేయలేదు. కానీ అతి తక్కువ మంది, అందులోనూ హేమాహేమీ దర్శకులు మాత్రం ఈ జోనర్‌లో చిత్రాన్ని రూపొందించారు. ఇప్పుడు తొలిసారి నేను చేస్తున్నాను. మా కథ సిద్ధం కాగానే చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. భారీ స్థాయిలో సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. అన్ని క్రాఫ్ట్స్ కి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చే చిత్రమవుతుంది`` అని అన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







