భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జపాన్ లో...!!
- November 21, 2016
సునామీల పురిటిగడ్డ జపాన్ మళ్లీ సునామీ ధాటికి విలవిలలాడి పోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా సునామీ భారీన పడుతున్న దేశాల్లో జపాన్ మొదాటి స్థానాన్ని ఆక్రమించిన విషయం అందరికీ తెలిసిందే. తూర్పు జపాన్‌లో మంగళవారం తెల్లవారుజామున 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనిని అమెరికా భూభౌతిక సర్వే సంస్థ ధ్రువీకరించింది. భూకంపం సమయంలో సముద్రంలోని అలలు దాదాపు 3మీటర్ల ఎత్తున ఎగసిపడటంతో సునామీ వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.స్థానిక కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున 5:59 గంటలకు ఈ భూకంపం సంభవించింది. సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరళి వెళ్లాలంటూ జపాన్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది భూకంప కేంద్రం టోక్యోలో ఉన్నట్టు గుర్తించామని, భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రాణ, ఆస్తినష్టంపై ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదు.భూమికి 11 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించినట్లు గుర్తించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతవరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం లేదు. టోక్యోలోని కొన్ని తీరప్రాంతాల్లో నివసించే ప్రజల నివాసాలను ఖాళీ చేయిస్తున్నారు. భూకంపం కారణంగా ఫుకుషిమాలో ఉన్న అణు విద్యుత్ కేంద్రాలకు ఏమైనా నష్టం వాటిల్లిందేమోనని టోక్యో ఎలక్ట్రి పవర్ కంపెనీ పరిశీలిస్తోంది. మార్చి 2011లో జపాన్‌ను సునామీ కుదిపేసిన సంగతి తెలిసిందే.జపాన్‌లో భూకంపాలు సర్వసాధారణమైన విషయం. ప్రపంచవ్యాప్తంగా సంభవించే భూకంపాల్లో 20శాతం ఇక్కడే జరుగుతుండడం గమనార్హం. మార్చి 2011లో 9.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. జపాన్ చరిత్రలో ఇదే అతి భయంకరమైన భూకంపం. ఈ భూకంపం సమయంలోనే ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం ధ్వంసమైంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







