అమెరికాలో ఘోర బస్సు ప్రమాదం...
- November 21, 2016
అమెరికాలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. టెనస్సీ లోని ఓ పాఠశాలకు చెందిన బస్సు చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రాణాంతకమైన ప్రమాదంలో పలువురు చిన్నారులు మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. కిండర్ గార్టెన్ , ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 35 మందితో వెళ్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యల్ని చేపట్టారు. గాయపడిన చిన్నారులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఎంతమంది మరణించారనేది ఇపుడే చెప్పలేమని, తీవ్ర గాయాలపాలైన 20 మందిని ఆసుపత్రికి తరలించినట్టు ఛత్తనూగ పోలీసు అధికారి ట్రేసీ ఆర్నాల్డ్ తెలిపారు. అయితే ఎక్కువమంది చనిపోయి వుంటారని భావిస్తున్నామన్నారు.
మరోవైపు హామిల్టన్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం ఆరుగురు చనిపోయారని నివేదించింది. సుమారు 12 మంది పిల్లలు చనిపోయారని స్థానిక మీడియా వెల్లడించింది. దీనిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







