ఐదున్నర కోట్ల పెద్ద నోట్లతో ఎయిర్ పోర్ట్ లో పట్టుబడ్డ వ్యక్తి
- November 22, 2016
చార్టర్డ్ ఫ్లైట్‌లో రూ.5.5కోట్ల విలువైన పాతనోట్లను తరలిస్తున్న ఒక వ్యక్తిని నాగాలాండ్ ఎయిర్‌పోర్ట్‌లో మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌లోని ముంగర్‌కి చెందిన సింగ్ అనే వ్యాపారవేత్త ఈరోజు ఉదయం హరియాణాలోని సిర్సా ప్రాంతం నుంచి చార్టర్డ్ ఫ్లైట్‌లో ఒంటరిగా నాగాలాండ్ వచ్చాడు. అయితే అతనిపై అనుమానం రావటంతో సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది విచారించగా డబ్బు ఉన్నట్లు వెల్లడించాడు. ఆ డబ్బు ఎవరిదీ అనే విషయాన్ని ఆరా తీస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతని వద్ద ఉన్నదంతా రద్దయిన పెద్ద నోట్లే అని, వాటి విలువ రూ.5.5కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నల్లధనాన్ని నిర్మూలించేందుకు పెద్ద నోట్లు రద్దు చేసిన నేపథ్యంలో ఎయిర్‌పోర్టులో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







