మూతపడ్డ ట్రాన్స్ ఏసియా ఎయిర్ వేస్
- November 22, 2016
తైవాన్ కు చెందిన తొలి ప్రైవేట్ విమానయాన రంగ సంస్థ ట్రాన్స్ ఏసియా ఎయిర్ వేస్ మూతపడింది. భారీ ఆర్థిక నష్టాలు, ఇటీవల జరిగిన రెండు ప్రమాద ఘటనల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ట్రాన్స్ ఏసియా చైర్మన్ విన్సెంట్ లిన్ ఈ విషయాన్ని ప్రకటించారు. నష్టాలను భరించే స్థితిలేదని, అదనంగా నిధులు సమకూరకపోవడంతో ట్రాన్స్ ఏసియాను మూసివేస్తున్నట్టు తెలిపారు.
1951లో ట్రాన్స్ ఏసియా ఎయిర్ వేస్ ను స్థాపించారు. చైనా, జపాన్, ఆగ్నేయాసియా దేశాల్లోని పలు నగరాల మధ్య ఈ సర్వీసులను నడిపారు. 2014, 2015లో తైవాన్ లో ఈ సంస్థకు చెందిన రెండు విమానాలు కూలిపోయాయి. ఈ ప్రమాదాల్లో మొత్తం 92 మంది మరణించారు.
పైలట్ల తప్పిదాల వల్లే ప్రమాదాలు జరిగినట్టు విచారణలో తేలింది. దీనికి తోడు ఈ సంస్థ నష్టాల ఊబిలో కూరుకుపోయింది. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో ట్రాన్స్ ఏసియా భారీగా నష్టాలు చవిచూసిందని, కోలుకునే అవకాశం కనిపించకపోవడంతో బోర‍్డు డైరెక్టర్ల సమావేశంలో కంపెనీని మూసివేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నామని విన్సెంట్ లిన్ మీడియా సమావేశంలో చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







