చివరిదశలో 'శివలింగ' షూటింగ్

- November 22, 2016 , by Maagulf
చివరిదశలో 'శివలింగ' షూటింగ్

కన్నడంలో సూపర్‌హిట్ అయిన శివలింగ చిత్రాన్ని అభిషేక్ ఫిలింస్ బ్యానర్‌పై రాఘవేంద్ర లారెన్స్‌, రితిక సింగ్ హీరో హీరోయిన్లుగా పి.వాసు దర్శకత్వంలో రమేష్ పి.పిళ్లై నిర్మిస్తున్నారు. ఒక సాంగ్ మినహా సినిమా చిత్రీకరణ అంతా పూర్తయ్యింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ప్రైవేటు హోటల్లో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు పి.వాసు మాట్లాడుతూ - "పదేళ్ల క్రితం కన్నడంలో నేను డైరెక్ట్ చేసిన ఆప్తమిత్ర చాలా పెద్ద హిట్ అయితే రజనీకాంత్ హీరోగా జ్యోతిక టైటిల్ పాత్రలో ఆప్తమిత్రనే చంద్రముఖిగా తెరకెక్కించాను. చంద్రముఖి తెలుగు, తమిళంలో పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు అలాగే నేను కన్నడలో డైరెక్ట్ చేసిన శివలింగ అక్కడ సూపర్‌హిట్ అయ్యింది.

75 సెంటర్స్‌లో 100రోజులు ఆడింది. ఈ సినిమా వడివేలుగారు నటిస్తున్నారు. అలాగే మా అబ్బాయి శక్తివాసు ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించాడు. తమిళంలో రవిచంద్రన్‌గారు సినిమాను నిర్మిస్తే తెలుగులో రమేష్‌గారు సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శివ లింగ చిత్రాన్ని తెలుగు, తమిళంలో ఏక కాలంలో సినిమాను షూటింగ్ చేశాం. కాంచన, కాంచన2లకు రాఘవేంద్ర లారెన్స్ ఎంత రిస్కు తీసుకుని నటించాడో అంత కంటే ఎక్కువ రిస్కు తీసుకుని ఈ సినిమాలో యాక్ట్ చేశాడు. ఓ సాంగ్ మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది" అన్నారు.  


ఈ మీడియా సమావేశంలో రవిచంద్రన్, నిర్మాత రమేష్ పి.పిళ్లై , సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌.థమన్, శక్తివాసు, సినిమాటోగ్రాఫర్ సర్వేష్ మురారి,హీరో, కోరియో గ్రాఫర్, రాఘవేంద్ర లారెన్స్ తదితరులు పాల్గొన్నారు. 
ఈ మూవీలో రాఘవలారెన్స్‌, రితిక సింగ్‌, వడివేలు, శక్తివాసు, రాధారవి, జయప్రకాష్‌, ప్రదీప్ రావత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః సర్వేష్ మురారి. మ్యూజిక్ః ఎస్‌.ఎస్‌.థమన్‌, సాహిత్యంః రామజోగయ్య శాస్త్రి, ఆర్ట్ః దురైరాజ్‌, ఫైట్స్ః అనల్ అరసు, దినేష్‌, ఎడిటింగ్ః సురేష్‌, నిర్మాతః రమేష్‌.పి.పిళ్లై, దర్శకత్వంః పి.వాసు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com