స్విట్జర్లాండ్‌తో సమాచార మార్పిడికి ఒప్పందం
- November 22, 2016
నల్లధనంపై కేంద్ర ప్రభుత్వం పోరాటంలో మరో పెద్ద ముందడుగు పడింది. స్విట్జర్లాండ్‌తో సమాచార మార్పిడికి ఒప్పందం కుదిరింది. స్విస్ బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్న భారతీయులకు సంబందించిన ఆర్థిక సమాచారం ఆటోమేటిక్‌గా 2019 సెప్టెంబర్ నుంచి భారత ప్రభుత్వానికి అందుతుంది. విదేశాల్లో పోగుపడుతున్న నల్లధనం పిశాచంతో పోరాడటానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. ఇరు దేశాల మధ్య ఆటోమేటిక్ సమాచార మార్పిడి అమలు కోసం ఉద్దేశించిన ఉమ్మడి ప్రకటనపై సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్ర, భారతదేశంలో స్విస్ రాయబార కార్యాలయం డిప్యూటీ చీఫ్ గిల్లీస్ రోడ్యుట్ మంగళవారం సంతకాలు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







