కోకాకోలా, పెప్సీ కంపెనీలకు నో చెప్పిన జయ సర్కారు

- November 22, 2016 , by Maagulf
కోకాకోలా, పెప్సీ కంపెనీలకు నో చెప్పిన జయ సర్కారు

తమిళనాడు ప్రభుత్వం సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. బహుళ జాతి సంస్థల ఒత్తిళ్లకు తలొగ్గకుండా స్థానికులకే పెద్దపీట వేసింది. సాఫ్ట్ డ్రింక్స్ తయారు చేయడానికి నీళ్లు ఇవ్వబోమంటూ కోకాకోలా, పెప్సీ కంపెనీలకు నో చెప్పేసింది జయ సర్కార్. ఈ వ్యవహారంపై కొన్నాళ్లుగా ఆ రాష్ర్టంలో ఆందోళనలు జరుగుతున్న విషయం తెల్సిందే! నార్మల్‌గా సాఫ్ట్‌డ్రింక్ తయారీ యూనిట్ స్థాపించాలంటే ఒక లీటర్‌కు భారీ మోతాదులో నీళ్లు అవసరం అవుతాయి. అసలే నీటి కొరతతో ఇబ్బందులు పడుతోంది తమిళనాడు. నీటి కోసం పొరుగురాష్ర్టాలతో ఆందోళనకు దిగిన సందర్భాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నాడీఎంకె వర్గాలు చెబుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com