పెద్ద నోట్ల రద్దుపై కేంద్రం మరో సంచలన ప్రకటన
- November 22, 2016
పెద్ద నోట్ల రద్దుతో జనం ఇబ్బందులను గ్రహించిన కేంద్రం ఊరట నిచ్చే ప్రకటన చేసింది. ఈ నెల 24 నుంచి బిగ్ బజార్ షాపింగ్ మాల్స్‌లో డిబిట్ కార్డు ద్వారా రూ.2000 వరకు డబ్బులు డ్రా చేయవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే ఈ నెల 24తో ముగియనున్న ఎయిర్ పోర్టులో ఉచిత పార్కింగ్ ను ఈ నెల 28 అర్థరాత్రి వరకు పొడిగించింది. ఐఆర్‌టీసీలో టికెట్ల బుకింగ్ సర్వీస్ ట్యాక్స్‌ను డిసెంబర్ 31 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పాత రూ.1000, రూ.500 నోట్లు చిన్న మొత్తాల పొదుపులో డిపాజిట్ చేసుకునే అవకాశం లేదని స్పష్టం చేసింది. అయితే బ్యాంకు ఖాతాలేని వారు ఇతర ఖాతాదారుల లిఖితపూర్వక అనుమతితో జమ చేసే మొత్తాన్ని పది వేల నుంచి ఇరవై వేలకు ఆర్బీఐ పెంచింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







