ఆర్టీసీ త్వరలో కొత్త 'రాజధాని'బస్సులను తెలంగాణ రోడ్లపైకి....
- November 22, 2016
ఆర్టీసీ త్వరలో కొత్త 'రాజధాని'బస్సులను రోడ్లపైకి తెస్తోంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 61 రాజధాని (పూర్వపు పేరు ఇంద్ర) బస్సులు తిరుగుతున్నాయి. ఇవన్నీ పాతబడిపోవటంతో వాటి స్థానంలో కొత్తగా 95 బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. వాటిని సమకూర్చుకునే ప్రక్రియ దాదాపుగా పూర్తి అవుతున్నందున త్వరలో వాటిని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.సూపర్ లగ్జరీ కంటే టికెట్ ధర కాస్త ఎక్కువే అయినప్పటికీ సౌకర్యాల పరంగా మెరుగ్గా ఉండటంతో రాజధాని బస్సులకు మంచి డిమాండ్ ఉంది. మరోవైపు అన్ని జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు ఏసీ బస్సులు నడపాలని సీఎం కూడా ఆదేశించటంతో వాటి సంఖ్య పెంచాలని అధికారులు నిర్ణయించారు.డిమాండ్ ఉన్న దూరపు ప్రాంతాలకు ఎక్కువ సంఖ్యలో బస్సులు నడపాలని నిర్ణయించారు. సూపర్ లగ్జరీలుగా పాత బస్సులు... పాత రాజధాని బస్సులను సూపర్‌లగ్జరీ బస్సులుగా మార్చాలని నిర్ణయించారు. వాటికి కొత్త బాడీ అమర్చి కొత్త రూపుతో రోడ్లపైకి తేనున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







