2017 నాటికి అబుదాబీ - దుబాయ్‌ కొత్త హైవే సిద్ధం

- November 22, 2016 , by Maagulf
2017 నాటికి అబుదాబీ - దుబాయ్‌ కొత్త హైవే సిద్ధం

అబుదాబీ జనరల్‌ సర్వీసెస్‌ కంపెనీ ముసానాదా, 62 కిలోమీటర్ల పొడవైన అబుదాబీ - దుబాయ్‌ హైవే వచ్చే ఏడాది నాటికి సిద్ధమవుతుందని ప్రకటించింది. మునిసిపల్‌ ఎఫైర్స్‌ మరియు ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌తో కలిసి ముసానాదా చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌, అబుదాబీ ఎమిరేట్‌లో అతి ముఖ్యమైన ల్యాండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ప్రాజెక్ట్‌గా చెప్పబడ్తోంది. ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌కి ఊతమిచ్చేలా ఈ ప్రాజెక్ట్‌ని డిజైన్‌ చేశారు. మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ రోడ్‌ ఎక్స్‌టెన్సన్‌గ్‌గా రూపొందుతున్న ఈ హైవే, షుయైబ్‌ వద్ద అబుదాబీ బోర్డర్‌ని, అలాగే స్వైహాన్‌ ఇంటర్‌ఛేంజ్‌ ద్వారా దుబాయ్‌ని కనెక్ట్‌ చేస్తుంది. రెండు డైరెక్షన్లలోనూ నాలుగేసి లేన్లతో ఈ హైవే రూపుదిద్దుకుంటోంది. పీక్‌ అవర్స్‌లో అదనపు ట్రాఫిక్‌ని తట్టుకోగలిగేలా ఈ రోడ్డుని నిర్మిస్తున్నారు. అబుదాబీ సిటీ మరియు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌, యాస్‌ సాదియాత్‌ ఐలాండ్స్‌ని ఈ హైవే కనెక్ట్‌ చేస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com