రోడ్డు ప్రమాదం: ఆరుగురికి గాయాలు
- November 22, 2016
రోడ్డు ప్రమాదంలో విజిబిలిటీ కారణంగా 25 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. అబుదాబీ పోలీస్ జనరల్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ అలి ఖల్ఫాన్ అల్ ధాధెరి వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రమాదంలో గాయపడ్డవారిని తవామ్ హాస్పిటల్‌కి తరలించారు. ప్రమాద ఘటన గురించి సమాచారం అందించిన వెంటనే, ఘటనా స్థలికి చేరుకుని సహాయ కార్యక్రమాల్ని ముమ్మరం చేశామని ఆయన తెలిపారు. అక్కడికక్కడే క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స చేసి, ఆ తర్వాత పరిస్థితి విషమంగా ఉన్నవారిని అల్ అయిన్‌లోని తవామ్ ఆసుపత్రికి తరలించారు. లో విజిబిలిటీ కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కన్పించకపోవడంతో పలు వాహనాలు ప్రమాదాలకు గురయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. వాహనదారులు పరిస్థితులకు అనుగుణంగా వాహనాల్ని నడపాల్సి ఉంటుందనీ, లో విజిబిలిటీ ఉన్నప్పుడు తక్కువ వేగంతో ప్రయాణించాలనీ, తగిన సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని, ముందు వెళ్ళే వాహనానికి తగినంత దూరం పాటించాలని పోలీసు అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







