యుఎస్‌లో ఘనంగా జరిగిన సినర్జీ మీటింగ్

- November 23, 2016 , by Maagulf
యుఎస్‌లో ఘనంగా జరిగిన సినర్జీ మీటింగ్

అమెరికాలోని డలాస్ లో ఐటీ సర్వ్ అలయన్స్ సినర్జీ మీటింగ్ ఘనంగా జరిగింది. రెండు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యి నుంచి 12వందల మంది ఐటీ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సదస్సులో బిజినెస్ సెషన్స్, ప్యానల్ డిస్కషన్స్, పలువురు సీఈవోల భవిష్యత్ ఆలోచనలు, కొత్త కంపెనీల ఏర్పాటుతోపాటు అనేక అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న APNRT సీఈవో రవి వేమూరి.. ఏపీ ప్రభుత్వం తరుఫున ఐటీ సర్వ్ కు కావాల్సిన సహకారం ఎప్పటికీ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ సదస్సును విజయవంతం చేసిన కార్యవర్గ సభ్యులందరికీ ఐటీ సర్వ్ ప్రెసిడెంట్ శశి దేవిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కాబోయే ప్రెసిడెంట్ సతీష్ నన్నపనేనికి ఐటీ సర్వ్ కార్యవర్గం శుభాకాంక్షలు తెలిపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com