సెంట్రల్‌ మార్కెట్‌ అభివృద్ధికి ప్లాన్‌

- November 23, 2016 , by Maagulf
సెంట్రల్‌ మార్కెట్‌ అభివృద్ధికి ప్లాన్‌

మనామా సెంట్రల్‌ మార్కెట్‌ అభివృద్ధి కోసం కాంప్రహెన్సివ్‌ ప్లాన్‌ని అమలు చేయనున్నారు. మినిస్ట్రీ ఆఫ్‌ వర్క్స్‌, మునిసిపాలిటీస్‌ ఎఫైర్స్‌ మరియు అర్బన్‌ ప్లానింగ్‌ ఈ అంశాన్ని లోతుగా పరిశీలిస్తోంది. ప్రైమ్‌ మినిస్టర్‌ ప్రిన్స్‌ ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా సూచన మేరకు ఈ చర్యలు చేపడుతున్నారు. తొలి ఫేజ్‌ ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభమవుతుంది. మొత్తం 770,000 దిర్హామ్‌ల ఖర్చుతో దీన్ని చేపడతారని అండర్‌ సెక్రెటరీ డాక్టర్‌ నబిల్‌ బిన్‌ మొహమ్మద్‌ అబ్దుల్‌ ఫతే వెల్లడించారు. మనామా సెంట్రల్‌ మార్కెట్‌ సందర్శన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వివరాలు చెప్పారు. స్థానిక అవసరాలకు తగ్గట్లుగా మార్కెట్‌ని అభివృద్ధి చేయడం, అలాగే వ్యాపార కార్యకలాపాలు మరింత మెరుగయ్యేందుకు వీలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యాలని ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com