జెడ్డా ఆయిల్ ట్యాంకర్ ఫైర్: నలుగురికి గాయాలు
- November 24, 2016
జెడ్డా: జెడ్డా సౌత్ ఈస్ట్‌లోని ఓ ఫెన్స్ యార్డ్‌లో ట్యాంకర్‌కి మంటలు అంటుకున్న ఘటనలో నలుగురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై సివిల్ డిఫెన్స్ ప్రతినిథి కల్నల్ సయీద్ సర్హాన్ మాట్లాడుతూ, సంఘటన గురించి తెలియగానే సివిల్ డిఫెన్స్ ఘటనా స్థలికి చేరుకుని మంటల్ని ఆర్పి వేసిందనీ, అలాగే సౌది రెడ్ క్రిసెంట్ మెడిక్స్ గాయపడినవారిని దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం తరలించారని తెలిపారు. కల్నల్ తలాల్ బెదైవి సూపర్విజన్లో సివిల్ డిఫెన్స్ ఆపరేషన్లు నిర్వహించబడుతున్నాయి. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వాటిని నిలువరించడానికి సివిల్ డిఫెన్స్ పాత్ర ఎంతో కీలకంగా ఉంటోందనీ వేగంగా ఘటనా స్థలికి చేరుకోవడం ద్వారా ప్రమాద తీవ్రతను వీలైనంత త్వరగా తగ్గించగలుగుతున్నట్లు సివిల్ డిఫెన్స్ వెల్లడించింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







