హైదరాబాద్‌లో జరగనున్న 'ఐపీటీఎల్‌-2016' టెన్నిస్‌ ఫైనల్స్‌

- November 24, 2016 , by Maagulf
హైదరాబాద్‌లో జరగనున్న 'ఐపీటీఎల్‌-2016' టెన్నిస్‌ ఫైనల్స్‌

'ఐపీటీఎల్‌-2016' టెన్నిస్‌ ఫైనల్స్‌ హైదరాబాద్‌లో జరగనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. డిసెంబర్‌ 9,10,11 తేదీల్లో ఈ పోటీలు జరగుతాయని చెప్పారు. ఐపీటీఎల్‌ను హైదరాబాద్‌కు తెచ్చినందుకు మహేశ్‌భూపతికి ధన్యవాదాలు తెలిపారు. గోపీచంద్‌ అకాడమీ ద్వారా సైనా, సింధు, కశ్యప్‌ లాంటి ఛాంపియన్లు తయారయ్యారని.. టెన్నిస్‌లో సానియా మీర్జా అంతర్జాతీయ పేరు ప్రఖ్యాత్యులు సంపాదించిందని పేర్కొన్నారు. ఫెదరర్‌, సెరీనా విలియమ్స్‌ లాంటి ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారని.. దీనివల్ల పిల్లలకు ఆటపై మరింత ఆసక్తి పెరుగుతుందని చెప్పారు. హైదరాబాద్‌లో టెన్నిస్‌ అకాడమీని ఏర్పాటు చేయాలని మహేశ్‌భూపతిని కోరినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. దిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్‌ నగరాలను పరిశీలించానని తెలంగాణ ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్‌లో ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నామని మహేశ్‌ వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com