హైదరాబాద్లో జరగనున్న 'ఐపీటీఎల్-2016' టెన్నిస్ ఫైనల్స్
- November 24, 2016'ఐపీటీఎల్-2016' టెన్నిస్ ఫైనల్స్ హైదరాబాద్లో జరగనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. డిసెంబర్ 9,10,11 తేదీల్లో ఈ పోటీలు జరగుతాయని చెప్పారు. ఐపీటీఎల్ను హైదరాబాద్కు తెచ్చినందుకు మహేశ్భూపతికి ధన్యవాదాలు తెలిపారు. గోపీచంద్ అకాడమీ ద్వారా సైనా, సింధు, కశ్యప్ లాంటి ఛాంపియన్లు తయారయ్యారని.. టెన్నిస్లో సానియా మీర్జా అంతర్జాతీయ పేరు ప్రఖ్యాత్యులు సంపాదించిందని పేర్కొన్నారు. ఫెదరర్, సెరీనా విలియమ్స్ లాంటి ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారని.. దీనివల్ల పిల్లలకు ఆటపై మరింత ఆసక్తి పెరుగుతుందని చెప్పారు. హైదరాబాద్లో టెన్నిస్ అకాడమీని ఏర్పాటు చేయాలని మహేశ్భూపతిని కోరినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. దిల్లీ, ముంబయి, కోల్కతా, బెంగళూరు, అహ్మదాబాద్ నగరాలను పరిశీలించానని తెలంగాణ ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్లో ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామని మహేశ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







